హోం గార్డ్ రవిందర్ మృతి పై కేసు నమోదు

-

హోంగార్డు రవీందర్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ 306 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో ఏఎస్ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పేర్లను నిందితులుగా చేర్చారు. కానిస్టేబుల్ చందు పేర్లను నిందితులగా చేర్చారు. జీతం గురించి అడిగితే ఏఎస్ఐ, కానిస్టేబుల్ అవమానించారని.. మృతుడు హోంగార్డు రవీందర్ మరణం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు చెప్పారు.

హోంగార్డు అంశం తెలంగాణ హైకోర్టుకు చేరింది. హోంగార్డు రవీందర్ చావుకు కారణమైన అధికారులను శిక్షించాలని పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను హోమ్ గార్డు జేఏసీ దాఖలు చేసింది. హోంగార్డు రవీందర్ చావుతో జేఏసీ సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. అధ్యక్షుడు నారాయణ అరెస్ట్ చేశారని.. ఇప్పటివరకు ఆయన ఆచూకి తెలియదు అని పిటిషన్ లో జేఏసీ పేర్కొంది. హోంగార్డు రవీందర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news