కంటి చూపు బాగుండాలంటే.. వీటిని తప్పక పాటించండి..!

-

కంటి ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం దెబ్బ తినడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే కంటి చూపు తగ్గుతోంది. దాంతో కళ్లద్దాలు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు కూడా. కంటి సమస్యలతో బాధపడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ వలన కూడా కంటికి చూపు బాగా దెబ్బతింటుందని గ్రహించాలి. అయితే కంటి చూపుని మెరుగుపరుచుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు మనకి సహాయపడతాయి.

కంటి చూపుని మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటే కంటి చూపు బాగుంటుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుడ్లు లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది దాంతో కంటి ఆరోగ్యం బాగుంటుంది. కంటి చూపు బాగుండడానికి క్యారెట్లు, ఆకుకూరలని కూడా తీసుకోండి. ఈ రెండిటిని తీసుకోవడం వలన కూడా కంటి చూపు మెరుగుపడుతుంది.

కంటి చూపు బాగుండాలంటే బ్రోకలీ ని కూడా తీసుకోండి ఇందులో విటమిన్ ఏ బీటా కేరోటిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకుంటే కూడా కంటి సమస్యలు ఉండవు. రెట్టినా ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఇలా ఈ ఆహార పదార్థాలని కనుక మీరు తీసుకుంటున్నట్లయితే కచ్చితంగా కంటి ఆరోగ్యం బాగుంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ ఆహార పదార్థాలని మీరు తీసుకోండి అప్పుడు కంటి సమస్యలు ఏమి కూడా మీ దరి చేరవు.

Read more RELATED
Recommended to you

Latest news