విద్యకు జగనన్న దన్ను.. గ్రేట్ అంటున్న నోబెల్ గ్రహీత.!

-

విద్యలేని వాడు వింత పశువు అంటారు.. అయితే మన రాష్ట్రంలో విద్య  గురించే విమర్శలు చేసే నేతలు ఎక్కువమంది ఉన్నారు. ఇంకా అలాంటి వారిని ఏం అనాలో వారి విజ్ఞతకే వదిలేయాలి. జగన్ ప్రభుత్వంలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రతిపక్షాలు విమర్శలు ఆగవు. అయినా సరే జగన్ విద్యతోనే అభివృద్ధి అని నమ్మి..ప్రతి పేద విద్యార్థి పాఠశాలకు వచ్చి..చదువు నేర్చుకుని ఉన్న స్థాయికి ఎదగాలని కృషి చేస్తున్నారు. అయితే పేద విద్యార్థి స్కూల్‌కు రావడమే పెద్ద టాస్క్ .

ఎందుకంటే పేదవారు తమ పిల్లలని స్కూల్స్‌కు పంపడానికి ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి..పిల్లలని స్కూల్స్‌కు పంపకుండా పనులకు పంపిస్తారు. వారు కూడా కొన్ని రూపాయిలు సంపాదిస్తే..తమకు అండగా ఉంటారని ప్రతి పేద కుటుంబం భావిస్తుంది. కానీ అలా పిల్లలు చదువులకు దూరమవ్వడం వల్ల జీవితంలో వారు ఇంకా పేదవాళ్లు గానే మిగిలిపోతారు. అలా కాకుండా ఉండటానికే జగన్..అధికారంలోకి వచ్చాక సరికొత్త సంక్షేమ పథకాలతో విద్యకు ఊతమిస్తున్నారు.

మొదట ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు ఇస్తున్నారు. దీని ద్వారా పేద కుటుంబాలకు అండ దొరుకుతుంది. అదే విధంగా పిల్లలకు డ్రెస్సులు, బ్యాగ్స్, బూట్లు, పౌష్టికాహారం, భోజన వసతులు ఇలా ప్రతిదీ జగన్ ప్రభుత్వమే చూసుకుంటుంది. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేయడమే కాదు..కొందరు దుర్మార్గులు అడ్డుపడిన ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పిస్తున్నారు. ఇంకా చదువుకునే పేద, మధ్య తరగతి పిల్లలకు ఇంతకంటే ఏం కావాలి.

అయితే జగన్ విద్య కోసం చేస్తున్న కృషి దేశంలో ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డ్ గ్రహీత, చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్డ్ క్రేమెర్ ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విద్యని అందించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాజాగా ఆయన రాష్ట్రంలో పలు పాఠశాలలని సందర్శించేందుకు వచ్చారు. విద్యార్ధులకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి మైండ్ బ్లోయింగ్ అనే విధంగా ఆయన స్పందించారు. విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దుతాయని, ఈ విషయంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతం అంటూ నోబెల్ అవార్డు గ్రహీత క్రేమెర్ పొగడ్తల వర్షం కురిపించారు.

అయితే విద్యకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం గొప్ప గొప్ప వాళ్ళకు కనిపిస్తుంది..కానీ పచ్చ మీడియాకి…పచ్చ కళ్ళవారికి కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news