అన్నదాతపై పోలీసుల లాఠీ ఛార్జ్…ఆదిలాబాద్ లో ఉద్రిక్తత !

-

తెలంగాణ రాష్ట్ర అన్నదాతల మీద పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తిరిన రైతులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. అయితే… అన్నదాతల మీద పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసిన సంఘటనపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు.

Police lathi on food donors

కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని ఫైర్‌ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం అన్నారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నది.

కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి….రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news