జానీ మాస్టర్ అరెస్టు పై పోలీసులు అధికారిక ప్రకటన చేసారు. జానీ బాషాను గోవాలో అరెస్ట్ చేశాం. జానీ బాషా గోవా కోర్టులో హాజరు పరిచాం. గోవా కోర్టులో హాజరు పరిచి పీటీ వారంటీ కింద హైదరాబాద్ తరలిస్తున్నాం. రేపు ఉప్పర్ పల్లి కోర్టులో జానీ బాషాను హాజరు పరుస్తాం.జానీ బాషా పై ఫోక్సతో పాటు రేప్ కేసులు నమోదు చేశాం. కొరియోగ్రాఫర్ పై ముంబైలో అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు నమోదయింది.
2020లో ముంబై ట్రిప్ లో మైనర్ అయిన కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసారు జానీ బాషా. కొరియోగ్రాఫర్ పై పలుమార్లు బెదిరించి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో ఉంది. ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. మైనర్ గా ఉన్న సమయంలో అత్యాచారం చేసినందున ఫోక్సో సెక్షన్ యాడ్ చేశాం. జానీ బాషా లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారంతో పాటు దాడి పాల్పడ్డాడు అని పోలీసులు పేర్కొన్నారు.