రాహిల్‌ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పోలీసుల పిటిషన్‌

-

జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌కు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. రెండు కేసుల్లో బయటకు రాకుండా దిగ్బంధనం చేస్తున్నారు. అయితే ఈ కేసులో రాహిల్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును రద్దు చేయాలని కోరుతూ తాజాగా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు.

పంజాగుట్టలో బారికేడ్‌లను ఢీకొన్న కేసులో రాహిల్‌ దుబాయ్‌ నుంచి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మృతి చెందగా కారు ప్రమాదానికి కారణమైన ముగ్గురు పారిపోయారు. అయితే కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం, తరువాత ఓ వ్యక్తి తానే కారు నడిపానని చెప్పి స్టేషన్‌లో లొంగిపోవడం జరిగింది. ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ రాహిల్‌ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిలు పొందగా.. తాజాగా ఆ బెయిలును రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version