సెలూన్ ముసుగులో వ్యభిచారం.. మసాజ్ సెంటర్ పేరుతో మహిళలను !

సెలూన్ పేరుతో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తిపై సరూర్ నగర్ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ నూరినగర్ కు చెందిన షేక్ ఆయాజ్ (24) దిల్సుఖ్ నగర్ లో స్పా అండ్ సెలూన్ నిర్వహించే బలరాం కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

లలితానగర్ లోని సిగ్నేచర్ స్టూడియో హెయిర్ అండ్ స్కిన్, మేకప్ అకాడమీకి అందమైన యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్టోబర్ 7న స్పా సెంటర్ పై దాడి చేశారు. షేక్ ఆయాజ్, బలరాం లను అరెస్టు చేసే రిమాండ్ కు తరలించారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోం కు తరలించారు. కాగా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నిందితుడు షేక్ ఆయాజ్ పై పిడి యాక్ట్ నమోదు చేసి బుధవారం చర్లపల్లి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.