జీవితంలో ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలని ఆశిస్తారు. పైగా ఎంతో కష్టపడినా సరే విజయాన్ని పొందలేరు. దానికి కారణం సరైన ప్రణాళిక లేకపోవడం అని చాణిక్యుడు చెబుతున్నాడు. కనుక సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీనితో పాటుగా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే విజయాన్ని తప్పకుండా సాధించవచ్చు. కనుక చాణిక్యుడు చెప్పిన విషయాలను తెలుసుకొని జీవితంలో విజయాన్ని సాధించవచ్చు. ఎలాంటి రంగంలో అయినా విజయాన్ని సాధించాలంటే ముందుగా వ్యక్తిత్వం బాగుండాలి. మంచి లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తారు.
చాణిక్యుడు గొప్ప పండితుడు అని అందరికీ తెలిసిందే. అయితే కేవలం బంధాలు, ఆర్థిక సమస్యలకు సంబంధించి చెప్పడంతో పాటుగా విజయం గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. దాంతో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని వాటిని పాటిస్తూ ఉంటారు. చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలో విజయాన్ని సాధించడం గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. జీవితంలో గెలుపు మరియు ఓటమి అనేవి సహజం, ఎప్పుడైతే మంచి మార్గంలో నడుచుకుంటారో విజయాన్ని తప్పకుండా సాధించవచ్చు. అదేవిధంగా లక్ష్యం ఉన్నవారు తప్పకుండా దేన్నైనా సాధిస్తారు. ఎందుకంటే ప్రణాళిక ప్రకారం లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు.
గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కనుక విజయాన్ని సాధించాలనుకునే వారు సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు. అంతేకాకుండా జీవితంలో అభివృద్ధి ఉండాలంటే తప్పకుండా సామర్థ్యం తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్లాలి. ఎటువంటి లక్ష్యాన్ని అయితే మీరు చేరుకోగలరు మరియు ఇబ్బందులు వచ్చినా సరే సిద్ధంగా ఉంటారో దానిని మాత్రమే ప్రయత్నించాలి. మనతో ఉండే ప్రతి ఒక్కరూ మనకు మంచి చేయలేరు మరియు స్నేహంగా ఉంటూనే కొంతమంది మోసాన్ని చేస్తూ ఉంటారు. కనుక మీకు సహాయం చేసేది ఎవరో గుర్తించి వారితో మాత్రమే స్నేహం చేయండి. ఇటువంటి విషయాలను తప్పకుండా పాటిస్తే విజయాన్ని సాధించవచ్చు అని చానిక్యుడు చెబుతున్నాడు.