రూబీ హోటల్ మేనేజ్మెంట్ పై క్రైమ్ నెంబర్ 169/ 2022 నమోదు చేసిన పోలీసులు

-

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అయితే ఈ హోటల్ లో మొత్తం 28 రూం లు ఉన్నట్లు సమాచారం. ఘటన సమయం లో హోటల్ లో 25 మంది ఉన్నారు. అందులో ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, బెంగాల్, వైజాగ్,ఒడిశా వాసులు ఉన్నట్లు సమాచారం. అయితే ఎలక్ట్రిక్ బైక్ పెలిందా లేదా జనరేటర్ బ్లాస్ట్ అనే దాని పై విచారణ కొనసాగుతోంది.

రూబీ హోటల్ తో పాటు జిమోపై మోటర్స్ నడుపుతున్నాడు రాజేందర్ సింగ్. సంవత్సరం నుండి సెల్లార్ లో అక్రమంగా ఎలక్ట్రికల్ స్కూటర్స్ నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. బెంగుళూరు కు చెందిన మన్మోహన్ తో పాటు మరో ముగ్గురు ప్రమాదం నుండి తప్పించుకునారు. రూబీ హోటల్ లో టెర్రస్ నుండి పక్కనున్న యాత్రి హోటల్ ద్వారా బయటపడ్డారు. 8 మంది మృతి చెందగా, 9 మంది క్షేతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో అల్లది హరీష్, సీత రామన్,వీరేందర్,బాలాజీ,రాజీవ్ మైక్, సందీప్ మాలిక్ మరో ఇద్దరు ఉన్నారు.

గాయపడ్డ వారిని అపోలో, యశోద కు తరలించారు. గాయపడ్డ వారిలో బెంగుళూరు కు చెందిన జయంత్ పరిస్థితి విషమంగా ఉంది. జయంత్ కు అపోలో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం నుండి తప్పించుకుని బయట పడ్డ గెస్ట్ మన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేశారు. క్రైం నంబర్ 169/2022 నమోదు చేసారు పోలీసులు. హోటల్ మేనేజ్మెంట్ పై 304(2), 324 ఐపి సి, ఎక్స్ప్లోసివ్ యాక్ట్ సెక్షన్ 9 కింద కేస్ నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news