ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా దంచికొట్టిన వానకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాల్లో కాలనీలు నీటమునిగాయి. జనగామ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గ్రామస్థులు వాగులో చిక్కుకుపోయారు.

జనగామ జిల్లా దేవరప్పుల మండలం పెద్దమడూరు వాగులో చిక్కుపోయిన నలుగురు రైతులను గ్రామస్తులు, సహాయక బృందాలు రక్షించాయి. వ్యవసాయ పనులకోసం వెళ్లి తిరిగి వస్తుండగా భారీగా కురిసిన వర్షంతో వాగు పొంగింది. వాగులోంచి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు రైతులు వరద ఉద్ధృతికి కొట్టుకుని పోతూ చెట్లను పట్టుకున్నారు.

దీంతో విషయం తెలిసిన గ్రామస్తులు.. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని కాపాడాల్సిందిగా మంత్రి ఆదేశించడంతో.. పోలీసు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు రెండు గంటలపైగా శ్రమించి.. తాళ్ల సాయంతో వారిని అర్ధరాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం నుంచి కాపాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.