బెంగళూర్ రేవ్‌ పార్టీ కేసు అప్డేట్.. నేడు నిందితుల విచారణ

-

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నిందితులను నేడు అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే 8 మందికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సినీ నటి హేమ కూడా ఉన్నారు. ఇవాళ వీరంతా పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అయిదుగురి బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.

మరోవైపు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు న్యాయస్థానంలో ఇవాళ పోలీసులు పిటిషన్‌ వేయనున్నారు. రేవ్‌ పార్టీలో 103 మంది పాల్గొనగా, వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైన విషయం తెలిసిందే. వారిలో నటి హేమతో కలిపి ఎనిమిది మందిని సోమవారం విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news