తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ తప్పిదం ఏమైనా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై విచారణ చేస్తున్నారు. అటు మృతి చెందిన కుటుంబాలకు సమాచారం ఇస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.