SRH ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్.. వీడియో వైరల్

-

రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్‌ మెగా టోర్నీ ఆదివారంతో ముగిసింది. లీగ్ మొదటి నుంచి దూకుడు ప్రదర్శన చూపించి సరికొత్త రికార్డులు సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్‌ ఫైనల్‌లో ఘోర ఓటమిని చవిచూసింది. కోల్‌కతా 8 వికెట్ల తేడాతో నెగ్గి మూడోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌.. చివరి అడుగులో బోల్తా పడడంతో అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు.

వేలం పాట నుంచి మొదలు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటి ఉండే ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్య మారన్‌ మ్యాచ్‌ అనంతరం ఎమోషనల్ అయ్యారు. జట్టు ఓడినా, గెలిచినా చప్పట్లతో మద్దతు తెలిపే తను.. ఫైనల్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఓడడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే, కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధైర్యంగా ఉండు కావ్య అంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు. వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ కావ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news