నాగార్జున సాగర్‌ వద్ద కొనసాగుతున్న పోలీసు పహారా

-

నాగార్జునసాగర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ ప్రాంతంలో ఇంకా పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్ల కంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు పహారా కాస్తున్నారు. ఓవైపు ఏపీ వైపున భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు ఇవాళ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేయనున్నట్లు సమాచారం . ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకోగా.. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 522 అడుగులకు చేరింది. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందంటే.. నవబంర్ 29వ తేదీ అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు.. సాగర్‌ వద్దకు చేరుకుని కాపలాగా ఉన్న ఎస్​పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు. అక్కడికి తెలంగాణ పోలీసుుల చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు గేట్లు దూకి.. సీసీ కెమెరాను లాఠీతో ధ్వంసం చేసి.. ప్రాజెక్టు 13వ క్రస్ట్ గేటు దగ్గరకు వెళ్లి ఇది తమ భూభాగమంటూ.. ముళ్ల కంచె వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news