5 రాష్ట్రాల్లో ఏక్సిట్ పోల్స్

-

రాజస్థాన్,మధ్యప్రదేశ్, రాజస్థాన్,మిజోరాం,ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.డిసెంబర్ 3వ తేదీన ఒకేసారి అన్ని రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పెద్దదైన రాజస్థాన్ రాష్ట్రంలో CVoter Exit Poll ఫలితాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కేవలం 81 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంగా మిగిలుతుందని తేల్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి దాదాపు 20 స్థానాలు కోల్పోనుందన్నది సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి పుంజుకుంటుందని వెల్లడించింది.గత ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 104 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసింది. ఇక బీఎస్పీ గత ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకోగా ఈ సారి కనీసం ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది.కాంగ్రెస్ కి 71-91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94-114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది.

 

ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది CVoter Exit Poll సర్వే. గత ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 125 వరకూ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తేల్చింది.గత ఎన్నికల్లో 109 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి స్వల్పంగా అంటే 9 స్థానాలు పోగొట్టుకుని100 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక బీఎస్పీ గత ఎన్నికల్లో గెలుచుకున్న రెండు స్థానాలను ఈసారి కూడా నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది.2 స్థానాలు గెలుచుకుంది.ఈసారి కాంగ్రెస్ కి 113-137 సీట్లు, బీజేపీ 88-112 స్థానాల్లో విజయం సాధిస్తాయని చెప్పింది.

మిజోరం ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర Exit Poll వచ్చింది.మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్న మిజోరంలో మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 18కి పడిపోయే అవకాశముందని అంచనా వేసింది Cvoter సర్వే. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకోగా ఈ సారి కూడా ఆ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చేసింది. ఇక ZPM పార్టీ గత ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో విజయం సాధించగా ఈసారి 15 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని చెప్పింది. ఇతరులు 1-2 స్థానాలకు పరిమితమవుతారని వెల్లడించింది.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 41-53 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది Cvoter సర్వే. బీజేపీ 36-48 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్ 68 స్థానాలు గెలవగా ఇప్పుడు 47 సీట్లకే పరిమితం కానుంది. బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 42 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చాలా ఆసక్తికరంగా చూసింది చివరి విడతలో జరిగిన తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ గురించే. తాజా అంచనాల ప్రకారం చూస్తే తెలంగాణలో అధికార BRSకి హ్యాట్రిక్ యోగం లేదని Cvoter సర్వే తేల్చింది.ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోగా హంగ్ వచ్చే అవకాశాలూ ఉన్నాయని తేల్చింది.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుంది తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి 38-54 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీకి 3-13 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఇతరులు 5 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని తేల్చింది.మరి ఇక్కడ ఓటర్లు కాంగ్రెస్ కి అవకాశమిస్తారో లేక బీఆర్ఎస్ ని కొనసాగనిస్తారో ఈ రెండు పార్టీలను కాదని దక్షిణాదిన విస్తరించేందుకు తెలంగాణ ఎన్నికలను ముఖ ద్వారంగా చేసుకోవాలని అనుకుంటున్న బీజేపీ కి పట్టం కడతారో ఓటరన్నే తేల్చాలి.

డిసెంబరు 3వ తేదీన ఈ 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రజలు ఎవరికి పట్టం కడతారో,ఎవరిని అధికారం నుంచి దించేస్తారో ఆదివారం వరకు వేచిచూడాలి. మినీ పార్లమెంట్ ఎన్నికలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news