సిరిసిల్లాలో పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.. ఎందుకంటే?

-

Polyester textile industry : సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలు గతంలో ప్రభుత్వానికి విక్రయించిన క్లాత్ బకాయిలు ఇంకా విడుదల కాలేదు. దీనికి తోడు ఇప్పటివరకు ఉత్పత్తి అయిన క్లాత్ గోదాముల్లో పేరుకుపోయింది. దీంతో దారం తెచ్చి క్లాత్ తయారుచేయలేక, కార్మికులకు కూలీ చెల్లించలేక యజమానులు పవర్ లూమ్స్ ను నిలిపివేశారు. ఫలితంగా ఉపాధి లేక కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. తాజాగా UP నుంచి వలస వచ్చిన అలోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Polyester textile industry bandh in Sirisilla

తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్స్ పార్కు ఇందిరమ్మ కాలనీలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అలోక్ కుమార్(55) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.అయితే..పవర్‌ లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న తరుణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ సర్కార్‌ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆగ్రహిస్తున్నారు. ఇక అటు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానుల మెరుపు సమ్మెపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టొద్దని..గత ప్రభుత్వ విధానాలు కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news