అవినీతి పరిపాలన లో కేసీఆర్ డిగ్రీ చేస్తే.. రేవంత్ రెడ్డి PHD చేశాడు : పొంగులేటి సుధాకర్

-

కాంగ్రెస్ 6 గ్యారెంటీ లపై బీజేపీ తమిళనాడు సహా ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు, వాగ్దానాలు చేశారు. 66 హామీలు, 460 వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే ఈ హామీలు నెరవేరుస్థా అని స్క్రిప్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సంవత్సరం తర్వాత ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు చేస్తున్నారు. ఏదో సినిమా లో కోడిని వేలాడ తీసి అన్నం తిన్నట్లుగా ఉంది కాంగ్రెస్ తీరు. అది ఏ పార్టీ చేసిన మంచి చేస్తే బీజేపీ మంచిని కొనియాడుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ అగ్రదేశాల సరసన చేరుతుంది.

కొంతమందికి రుణమాఫీ చేశారు, హామీలలో అర్హులైన అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చేయలేదు. బీజేపీ తరపున కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, ప్రజలను మభ్య పెట్టడం పై ఛార్జ్ షీట్ ప్రకటిస్తున్నాం . బీఆర్ఎస్ తప్పులను కాంగ్రెస్, కాంగ్రెస్ తప్పులను బీఆర్ఎస్ కప్పి పుచ్చుకుంటున్నారు. కేసిఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోతే, రేవంత్ రెడ్డి వచ్చి 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తిరిగి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు అని సంబరాలు జరుపుకుంటున్నారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరు వెళ్తే అక్కడి దేవుడు, దేవత ల మీద ప్రమాణం చేస్తున్నాడు. కేసీఆర్ అవినీతి పరిపాలన లో డిగ్రీ చేస్తే, రేవంత్ రెడ్డి PHD చేశాడు అని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version