రాజకీయ రంగం, వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో చైతన్యం అయిన జిల్లా ఖమ్మం. ఇక్కడ సత్తుపల్లికి చరిత్ర ఉంది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జలగం, తుమ్మల నాగేశ్వరరావులు ఎన్నో సేవలు అందించారు. ఇరిగేషన్ కోసం తుమ్మల ఎంతో కృషి చేశారు. అయితే గత ప్రభుత్వం బుగ్గపాడు ఫుడ్ పార్క్ పై నిర్లక్ష్యం గా పని చేశారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టు కోసం రూల్ కర్ర పట్టుకుని తుమ్మల నా వెంట పడ్డారు అని శ్రీధర్ బాబు అన్నారు.
అయితే పార్టీలో సీనియర్ నాయకుడు తుమ్మల . శక్తి వంత మైన నాయకత్వం ఖమ్మం జిల్లాల్లో ఉంది. నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్ కల్పిస్తాం. స్వశక్తి మహిళ గ్రూప్ లు సక్సెస్ గా నడుస్తున్నాయి. పది వేల చిన్న పరిశ్రమలు ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్నాం. తుమ్మల మాకు ఆదర్శం. పామాయిల్ పై తుమ్మలకు మంచి పరిజ్ఞానం ఉంది అని పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు.