బండి సంజయ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ – మంత్రి పొన్నం ప్రభాకర్

-

బండి సంజయ్ డ్రామా ఆర్టిస్ట్ భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు..ప్రజలకు కాదు వారి కార్యకర్తలకే అందుబాటులో లేకుండా జిల్లాకు ఏం చేశారో సంజయ్ చెప్పాలని ఫైర్‌ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ లో మార్నింగ్ వాక్ లో వాకర్స్ ని కలిసారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ponnam fires on bandi sanjay

ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ సాగుతుందని..ధరణి, 317 జీవో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 90 వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 90 నెలలు కూడా లేదు… నాణ్యతా లోపంతో కుంగిపోయింది…కాళేశ్వరం అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ జరుపుతామని హెచ్చరించారు. విద్యుత్ రంగ అక్రమాలపై కూడా విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు విచారణ జరపాలని సవాల్ చేసారు… మేము ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే ఎందుకు గాబరా పడుతున్నారని చురకలు అంటించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version