Sonia gandhi:సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తు..!

-

 

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు.

Public administration guarantee application in the name of Sonia Gandhi

ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే… ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడి ఫోటోతో ఒకరు ప్రజాపాలనకు అప్లై చేస్తే..తాజాగా సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు దర్శనం ఇచ్చింది. కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఇచ్చారు ఆకతాయిలు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version