మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటాం – పొన్నం ప్రభాకర్

-

మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటామని ప్రకటించారు పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు కాదని.. మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటామని ప్రకటించారు. నేను కూడా ప్రచారానికి వెళ్తానని చెప్పారు.

నాకు సీనియార్టీ వచ్చినప్పుడు గాంధీ భవన్ మీటింగ్ లో, ప్రియాంక గాంధీ వద్ద మీటింగ్ లో హాజరవుతానని.. అప్పటి వరకు నా నియోజకవర్గంలో నే ఉంటానని పేర్కొన్నారు. కేసీఆర్ ముచ్చట.. అక్బర్ బీర్బల్ కథలా వుందని.. వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారని ఆగ్రహించారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారని.. బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మొదటి నుండి బిజెపికి మద్దతిచ్చిన పార్టీ టీఆరెస్ అని.. జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచాడని ఫైర్‌ అయ్యారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోండని చురకలు అంటించారు పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news