ఆలయాల్లో ఇవాళ కేసీఆర్ పేరిట అర్చనలు

-

 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆధ్యాత్మిక దినోత్సవం’ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 12,625 దేవాలయాల్లో CM KCR గోత్రనామాలతో అర్చనలు, గణపతి, రుద్రచండీ హోమాలు నిర్వహించనున్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేస్తున్న కెసిఆర్ కు కృతజ్ఞతగా విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు…తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ ఉపేంద్ర శర్మ తెలిపారు.

కాగా, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు పర్యటించనున్నారు. శంకర్ పల్లి మండలం కొండకల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం… ఆ తర్వాత కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేస్తారు. అటు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version