తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ సింగర్ స్మిత ఫోటో దిగారు. సీఎం రేవంత్ తో కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేసిన ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు స్మిత. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ తరుణంలోనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రతి పక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతూంటే…సింగర్ స్మిత ఫోటో ఎందుకు దిగారు…కేరళ, ఢిల్లీ టూర్లు ఎందుకు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీరియస్ అవుతున్నారు.
అటు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ పత్రిక ప్రకటనలకే పరిమితం అయింది. కనీసం ఫీల్డ్ కు వెళ్లి పరిస్థిని సమీక్షించకపోవడం రైతు గుండెకు దైర్యం చెప్పకపోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు పలికిన ధర ఇప్పుడు ఎందుకు లేదు అంటూ ప్రభుత్వాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.