RAIN ALERT : రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

-

తెలంగాణలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు తెలిపారు. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని.. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మామడ(నిర్మల్‌ జిల్లా)లో 5.7, మునిగడప(సిద్దిపేట)లో 5.4, లింగాపూర్‌(కుమురంభీం)లో 5.3, పెద్దమంతాల్‌(వికారాబాద్‌)లో 5.2 సెంటీమీటర్ల వర్షం పడింది.

రాజధాని నగరంలో ఆదివారం పూట భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్ ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.

మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news