ఏపీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

-

జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ వస్తుంది..ఈ మేరకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కు శుభవార్త. జగన్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల్లా.. తొలిసారి పే–స్కేల్, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో కూడిన వేతనాలు అందుకోనున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు.. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్‌సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లో పాసైన ఉద్యోగులందరికీ.. ఒకేసారి ప్రభుత్వం జులై 1 నుంచి ప్రొబేషన్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారంతా జులై నెలకు సంబంధించిన వేతనాలను నేటి నుంచి అందుకోనున్నారు.

ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం అందుకుంటున్నారు. వాటి స్థానంలో పే– స్కేల్‌తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా పే – స్కేల్‌ అమలు చేసిన దాఖలాలు లేవు అంటున్నారు. అంతేకాదు డీడీవోల బదిలీల కారణంగా బిల్లుల సమర్పించడంలో ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల డీడీవోలు వివిధ కారణాలతో బిల్లులు అందించడం ఆలస్యమైనా 30వ తేదీ వరకు వచ్చే బిల్లులను అనుమతించారు.

ఈ ఉద్యోగాల కు సంబందించిన ఎన్నో వార్తలు విస్తృతంగా ప్రచారం జరిగాయి.నామ్ కే వాస్తు ఉద్యోగాలని,త్వరలోనే ఉద్యోగాలు పోతాయని ఏవేవో వార్తలు గత కొన్ని రోజులుగా తెగ చక్కర్లు కొట్టాయి.ఈ ఉద్యోగాలు తాత్కాలికమేనని, జీతాలు పెరగవంటూ చర్చ నడిచింది. మొత్తానికి ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేశారు. సచివాలయాల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు వీలు కాదని ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం చెప్పినా సరే సీఎం జగన్ కొత్త వేతనాల ప్రకారమే వారికి జీతాలివ్వాలని నిర్ణయం తీసుకున్నారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ప్రొబేషన్‌ తర్వాత తొలిసారి వేతనాలు అందుకోనున్న ఉద్యోగులకు అభినందనలు తెలిపారు..ఈ విషయం ఉద్యోగులు జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news