విండీస్ పై వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా.. మొదటి టీ 20 కూడా విజయం సాధించింది. ఇక ఇవాళ విండీస్, ఇండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ్టి టీ 20 మ్యాచ్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ రెండో టీ 20 మ్యాచ్ వార్నర్ పార్క్, బస్సెటెర్రే, సెయింట్ కిట్స్ వేదికగా జరుగనుండగా.. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్ల అంచనా
వెస్టిండీస్ : షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ (c & wk), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్
ఇండియా : రోహిత్ శర్మ (c), రిషబ్ పంత్ (wk), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్