ఉపాధ్యాయుల బదిలీలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఆధారంతో బదిలీల్లో టీచర్ల మధ్య వివక్ష చూపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా..? అని ప్రశ్నించింది. భార్యాభర్తలు ఒకే చోట ఉండాలన్నదే తమ ఉద్దేశమని.. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చామని, బదిలీల నిబంధనలు సవరించామని అదనపు ఏజీ తెలిపారు.
స్టే ఉన్నందున బదిలీ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు అడ్వకేట్ జనరల్. బదిలీల నిబంధనలు సవరించామని, నిబంధనల సవరణలను అసెంబ్లీ కౌన్సిల్ ముందు ఉంచామని తెలిపారు. నిబంధనలో మార్పులపై హైకోర్టుకు మెమో సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ త్వరగా చేపట్టాలని ఏజీ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.