ప్రజలకు నిజాలు తెలియాలనే విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల : భట్టి

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేశామని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్‌ రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్‌ సరఫరానే వెన్నెముక అని భట్టి విక్రమార్క చెప్పారు. రవాణా, సమాచార రంగాల మనుగడకు విద్యుత్‌ సరఫరా చాలా ముఖ్యమని భట్టి వెల్లడించారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచించేది కూడా విద్యుతేనన్న భట్టి విక్రమార్క తెలంగాణ వచ్చాక ఏర్పడిన ఉత్పత్తి ప్రారంభించిన విద్యుత్‌ కేంద్రాలే నాణ్యమైన విద్యుత్‌ అందించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు ఉంటే 31 అక్టోబర్‌ 2023 నాటికి రూ. 81,516 కోట్లు అప్పులు చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news