కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము

-

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్​ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ పరేడ్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పరేడ్​కు రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించారు. ఇలా రాష్ట్రపతి రివ్యూయింగ్ అధికారిగా వ్యవహరించడం ఇదే మొదటిసారి. క్యాడెట్ల నుంచి రాష్ట్రపతి ముర్ము మొదటిసారిగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మంత్రి సత్యవతి రాఠోడ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ హాజరయ్యారు.

ఈ పరేడ్​లో శిక్షణ పొందిన 119 ఫ్లైయింగ్ ఎయిర్‌ట్రైనీ, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మరో 8 మంది క్యాడెట్లు ఉన్నారు. శిక్షణ పొందిన వారిలో ఇద్దరు వియత్నాం క్యాడెట్లు, మిగతా ఆరుగురు నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన క్యాడెట్లు ఉన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news