రామగుండం రానున్న ప్రధాని మోదీ !

-

నవంబర్ 12వ తేదీన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం రానున్నారని తెలిపారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. గతేడాది మార్చి 22న ఈ కర్మాగారం వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిందని గుర్తు చేశారు. సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో రోజ్గార్ మేలా ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్ అందరికీ గృహ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు వివిధ రంగాలలో మరిన్ని ఉపాధి అవకాశాలు, పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 1,20,000 కోట్లు కేటాయించామన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జరుగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version