పదేళ్ల లో దేశ ముఖ చిత్రాన్ని ప్రధాని మోడీ మార్చేశారు : కిషన్ రెడ్డి

-

పదేళ్లలో దేశ ముఖచిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మార్చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ  ఆదిలాబాద్ బిజెపి విజేత సంకల్ప యాత్రలో భాగంగా  ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో బిజెపి బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో గత పదేళ్ల నుంచి కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిందని..   కెసిఆర్ కుటుంబ పాలన అవినీతిని అహంకారపూరితమైన నియంతృత ప్రభుత్వాన్ని చూసామని తెలిపారు.

కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ అన్నారు.  బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని.. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో  బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందన్నారు.  తెలంగాణ నుంచి బిజెపికి 17 సీట్లు రావాలి కోరారు.. తెలంగాణ బాగుపడాలంటే బిజెపికి ఓటు వేయాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news