Telangana Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్

-

Telangana Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.  తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి పాలన విధానాలపై కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఈ పాఠాలు చెప్పారు.

prof nageshwar rao classes to congress

ఎమ్మెల్యేలు బసచేసిన ఎల్లా హోటల్ లోనే అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు రాజ్యాంగపరమైన అంశాలను వివరించినట్లు సమాచారం. కాగా, లక్ష మందితో రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజిపీలతో పాటు ఇతర శాఖల అధికారులు పర్యవేక్షిస్తు న్నారని తెలిపారు. సుమారు లక్ష మంది ప్రమాణం స్వీకారోత్సవానికి తరలి వచ్చే అవకాశం ఉందని వివరం చారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి.

Read more RELATED
Recommended to you

Latest news