తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు కీలక పదవి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేరు సిఫారసు చేసినట్లు సమాచారం. తాజాగా తెలంగాణ విద్యా కమిషన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కమిషన్ కార్యకలాపాలు చూసుకునేందుకు ఒక చైర్మన్ ఉండాలి. అయితే ఆ బాధ్యతలను ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఇవ్వాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. కొంతమంది పేర్లను పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే… ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అరగోపాల్ మరియు ఆకునూరి మురళి పేర్లు తెరపైకి వచ్చాయట.
అయితే ఇందులో ఎక్కువ మంది ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. ఓకే చెబుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీని చైర్మన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే… సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, అరగోపాల్ మరియు ఆకునూరి మురళి ఉండబోతున్నట్లు సమాచారం. వీళ్ళ పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది.