తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా.. 285 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉన్నారు. అతితక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో నిలిచారు.
అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 32 లక్షల 32 వేల 318 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు నిలిచారు. సికింద్రాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మల్కాజిగిరి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నేత దానం నాగేందర్, హైదరాబాద్ నుంచి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ , చేవెళ్ల నుంచి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో నిలిచారు.