హైదరాబాద్ రోజు రోజుకు పబ్ కల్చర్ గబ్బు లేపుతుంది. మందు బాబులను ఆకర్షించడానికి ముంబై తరహా డాన్స్ షోలను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అలాగే తమ పబ్ లోకి వచ్చే కస్టమర్లకు అమ్మాయిలతో వల వేస్తున్నారు. అలాగే వచ్చిన కస్టమర్లతో పబ్ లో ఎక్కువ బిల్ వసూలు కు నయా ప్లాన్స్ ను రచిస్తున్నారు.
ముఖ్యంగా పబ్ లో అమ్మాయిల్ని హైర్ చేసి దందా చేస్తున్నారు. పబ్ క్లోజ్ అయ్యాక అమ్మాయిలను సప్లై చేస్తున్న వైనం ఉంది. BRS పార్క్ టాట్ పబ్ నిర్వాకం మరువక ముందే.. JNTU మంజీర మెజిస్టిక్ మాల్ లో మరో పబ్ అదే తరహా నిర్వాకంకు పాల్పడింది. అయినా కూడా చూసి చూడట్లు వదిలేస్తున్నారు అధికారులు . తూతూ మంత్రంగా రైడ్ చేసారు స్థానిక పోలీసులు. అలాగే ఎవరు వచ్చిన సెటిల్ చేస్కుంటా అంటూ ధీమాలో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.