బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన నిర్ణయం !

-

బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనున్నట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజకీయ సమీకరణాలపై ఓ ప్రాణాలకు సిద్ధం చేస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఆగ్రహించారు.

నాడు చంద్రన్న, నేడు జగనన్న అంటూ స్టికర్ అంటించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే వైద్యం అని చెప్పారు. ఆయుష్మాన్ భవ పదకం క్రింద ఒక్కొక్కరికి ఐదు లక్షలు అందిస్తున్నామని..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా జిల్లాల వారీగా కేంద్ర సహకారం అని తెలిపారు. ఇతర పార్టీలోని అసంతృప్తివాదులు బిజెపి సిద్ధాంతాలు నచ్చి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు.
మా ఎన్నికల వ్యూహం మాకు ఉంటుందని. చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news