జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. పలిమల మండలంలో భారీ భూ కుంభకోణం జరిగింది అంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర ఆరోపణలు చేసారు. మంత్రి తమ్ముడి కోసం 300 ఎకరాల భూకుంభకోణం చేశారని పుట్ట మధు పేర్కొన్నారు. 2008 ఏడాదిలో కమాలోద్ధిన్ అనే వ్యక్తి ద్వారా పలువురు కాంగ్రెస్ నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అయితే అప్పటి రైతులు ఎదురు తిరిగి.. ఇప్పటివరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మంత్రి ఎస్సీ, ఎస్టీల భూములను 200 ఎకరాలు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించరన్న పుట్ట మధు.. అప్పట్లో రైతులకు పాసు బుక్కులు కూడా ఉన్నాయి. కానీ పలిమెలలో బ్యాక్ వాటర్ రావడంతో అవి పనికిరాకుండా పోయాయి. మంత్రి తమ్ముని కోసం ఓ సిమెంట్ కంపెనీకి భూములను రిజిస్ట్రేషన్ చేశారు. జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ఎమ్మార్వో ఆఫీస్ లో కాకుండా దొంగ దారిలో దక్కన్ సిమెంట్ కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు పుట్ట మధుకర్.