శాసనమండలి మీడియా పాయింట్ లో ప్రతిపక్ష నేత మధుసూదన చారి కీలక వ్యాఖ్యలు చేసారు. లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వాళ్ళని వారి భూముల నుండి వెల్లగొట్టే కుట్ర చేస్తుంది ప్రభుత్వం. నిన్న, ఈ రోజూ రైతుల పక్షాన మండలిలో నిరసన తెలిపాము అని పేర్కొన ఆయన.. తమ భూములు లాక్కోవద్దు అని నినదించిన రైతులను జైల్లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి హాస్పిటల్ కి తీసుకురవడం ఈ దుర్మార్గపు ప్రభుత్వం వైఖరికి నిదర్శనం అని అన్నారు.
అలాగే చేయని తప్పుకి ఇప్పుడు రైతులు జైల్లో ఉన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని అడిగితే సభను వాయిదా వేస్తున్నారు. కరోనా సమయంలో మా నాయకుడు కేసీఆర్ రైతులను ఎలా ఆదుకున్నారో ప్రజలు గమనించాలి. గిరిజన రైతుల పక్షాన నిలబడుతాం, వారి సమస్యలు పరిష్కరించేవరకు విడిచిపెట్టము అని మధుసూదన చారి స్పష్టం చేసారు.