వినియోగదారులకు అలర్ట్.. ఇక నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కరెంట్ బిల్లు

-

విద్యుత్ వినియోగదారులకు ఇటీవలే ఆర్బీఐ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి విద్యుత్ బిల్లులు థర్డ్ పార్టీ యాప్స్ యూపీఐ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలలో చెల్లించకుండా తమ సంస్థ వెబ్సైట్లలోనే డైరెక్టుగా చెల్లించాలని ప్రకటనలో పేర్కొంది.

తాజాగా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) బిల్లు చెల్లింపులపై కొత్త ప్రకటన చేసింది. కరెంట్ బిల్లు చెల్లింపుల కోసం ఈ సంస్థ కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్‌ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుందని చెప్పింది. వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా దీన్ని స్కాన్‌ చేసి డెబిట్, క్రెడిట్‌ కార్డులు, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర విధానాల్లో బిల్లును చెల్లించే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది ఎన్పీడీసీఎల్‌ తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల(ఈఆర్‌వో) పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్‌ కోడ్‌ బిల్లుల విధానాన్ని తీసుకురానున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news