BREAKING : అర్థరాత్రి ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

-

BREAKING : అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటన చేశారు ప్రవీణ్ కుమార్. గ్రూప్ 2 వాయిదా వేయాలని బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ఇవాళ జరుగనున్న నేపథ్యంలో…నిన్ననే అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు.

ఈ తరుణంలోనే అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన ఇంట్లోకి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను అనుమతించడం లేదు. దీంతో ఇంట్లోనే దీక్ష కొనసాగించనున్నారు ప్రవీణ్ కుమార్. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, గ్రూప్ 2 వాయిదా వేసే వరకు పోరాడుతానని స్పష్టం చేస్తున్నారు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. మీడియాను లోపలికి పంపకుండా గేటు వద్దే అడ్డుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news