రాబంధుల రాజ్యమొస్తే.. రైతు బంధు రద్దవ్వడం గ్యారెంటీ : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పలు కీలక వాగ్దాలనాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ అర్థ శతాబ్దపు పాలన అంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నవి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పలు కీలక వాగ్దానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ అర్థ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నవని విమర్శించారు. కాంగ్రెస్ కపట కథలు బాగా తెలిసిన తెలంగాణ బిడ్డల గడ్డ ఇదని చెప్పారు.

ముఖ్యంగా రాబంధుల రాజ్యం వస్తే.. రైతుబంధు రద్దు అవ్వడం గ్యారెంటీ అని.. కాలకేయుల కాలం వస్తే.. కరెంట్ కోతలు, కటిక చీకట్లే దగాకోరుల పాలనొస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ అన్నారు. బకాసురులు గద్దెనెక్కితే.. రైతు భీమా గల్లంతు అవ్వడం గ్యారెంటీ అన్నారు. స్కాముల పార్టీని స్వాగతిస్తే.. స్కీముల ఎత్తివేత గ్యారెంటీ అన్నారు మంత్రి కేటీఆర్. దొంగల చేతికి తాళాలు ఇస్తే.. సంపద అంతా స్వాహా గ్యారెంటీ అని.. ఈ విషయం లేనోళ్లను విశ్వసిస్తే.. వినాశనం గ్యారెంటీ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news