ములాఖత్ లో చంద్రబాబు ఏమన్నారో చెప్పిన యనమల

కక్ష సాధిపుతో చంద్రబాబుపై అక్రమ కేసుతో జైలులో పెట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో యనమల ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బాధతో ఉన్నారన్నారు. కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారని తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు సంతోషంగా లేరన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెప్పారు. జాతీయ నేతలు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించారన్నారు. చంద్రబాబు రూమ్‌లో ఏసీ లేదని.. దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై నిర్ణయం తీసుకుంటామని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. మొదటి రోజు ములాఖత్ లో నారా భువనేశ్వరి రాజమండ్రి సెంట్రల్ జైలులో సదుపాయాలు లేవని.. చంద్రబాబు నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని ఆసక్తికర విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ను కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు.