మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి పై రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ ఎంపీగా జితెందర్ రెడ్డిని కాకుండా డీ.కే.అరుణను ప్రకటించడంతో జితెందర్ రెడ్డి కాస్త నిరాశకు గురై పార్టీని వీడాడు. తాజాగా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ లో పెద్ద పదవులు అనుభవించి.. పార్టీ కి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అన్నారు. ఏ ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు పార్టీ మారారో చెప్పాలి. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ తో కలిసి ఏమీ మాట్లాడారు.  ఈస్టర్న్ కన్స్ట్రక్షన్ ఎవరిది… భూములను ఆక్రమించింది ఎంత.? సర్వే నంబర్ 343, 403 లో ఏమీ జరుగుతుంది..?
అడ్డగోలు కన్స్ట్రక్షన్ మీద పిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

ఈడి, ఐటి కి పిర్యాదు చేస్తా..మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మీరు ఎందుకు పార్టీ మరారో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీరు బీజేపీ కి కొత్తగా సిద్దాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత, ఆర్థిక లబ్ది కోసం మీరు పార్టీ మారారు. పాలమూరు లో మీరు మీ కొడుకు కోసం పని చేశారా..? ఇప్పుడు అధికారం లోకి ఉన్న పార్టీ కి మద్దతు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news