తెలంగాణలో వేలు పెడుతున్న రఘురామకృష్ణ రాజు !

-

తెలంగాణలో వేలు పెడుతున్నారు రఘురామకృష్ణ రాజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో శెట్టిబలిజలు కోల్పోయిన బీసీ హోదాని తిరిగి పొందడంలో తమకు సహకారం అందించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజునున శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ కోరారు.


ఇక ఈ విషయంపై ఎంపీ రఘురామ తక్షణమే స్పందించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ తో పాటు జనరల్ సెక్రెటరీ కొప్పిశెట్టి వెంకటేశ్వర రావు, అడ్వైజర్ కె.యస్. మూర్తి, ఉపాధ్యక్షులు మామిడిశెట్టి నాగేంద్ర, గుబ్బల బాబ్జి, అడ్వైజర్ శ్రీ సానబోయిన వెంకటేశ్వర రావు, ట్రెజరర్ పిల్లి నాగ గోపాల్, మల్లుల శ్రీనివాస్, గుత్ల శోభన కుమార్ ఎంపీ రఘురామకృష్ణ రాజును కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news