కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్నూలు వాసులు మృతి

-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

A terrible accident in AP Three youths died

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరి వద్ద టెంపో వాహనం టైర్‌ పంక్చరై అదుపు తప్పింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మిర్చి రైతులు మృతి చెందారు. మృతులను పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్‌, పెద్ద వెంకన్న, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్నలుగా గుర్తించారు. మిర్చి లోడ్‌తో టెంపోలో బ్యాడిగి మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం టైర్ పంక్చర్ అయి అదుపు తప్పడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news