తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి… కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన రేవంత్…. కాంగ్రెస్ అగ్ర నేతలను కలిశారట.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒక్కరిది కాదని… అందరి నిర్ణయాలు గౌరవించాలని రాహుల్ గాంధీ చురకలాంటించారట. ఒంటెద్దు పోకోడాలతో ఎందుకు వెళ్తున్నామని ఫైర్ అయ్యారట.
సీనియర్ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదని… అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని ఆదేశించారట. జాతీయస్థాయిలో బిజెపి కూల్చివేతలకు వ్యతిరేకంగా… తాను పోరాటం చేస్తుంటే.. నువ్వు హైదరాబాదులో హైడ్రా పేరుతో కూల్చుతావా? అని నిప్పులు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అటు కేసి వేణుగోపాల్ తో.. కూడా ఇదే అంశాన్ని తెలిపారట. దీంతో.. రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ కూడా క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.