రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది – VH

-

ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సూరత్ జిల్లా కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష వేసింది కానీ.. 30 రోజుల గడువు ఇస్తూ బెయిల్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంకా 30 రోజుల గడువు ఉండగానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు వి హనుమంతరావు.

గతంలో అనేకమంది అనేక రకాలుగా మాట్లాడారని.. కానీ ఇలా ఎవరు చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై పోరాటం చేస్తామని తెలిపారు విహెచ్. అలాగే దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ ఉండకూడదని ఇలా చేస్తున్నారని ఆరోపించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్ లో ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా రాహుల్ గాంధీకి తాము అండగా ఉంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news