రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు..కేవలం ఒక్క రోజు మాత్రమే!

-

రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. ప్రస్తుతానికి ఒక రోజు టూర్ ఖరారు చేసింది ఎఐసిసి మండలి. ఈ 17వ తేదీ నర్సంపేట పాలకుర్తి వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటిస్తారు. రోడ్ షోలు కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్న రాహుల్ గాంధీ… ఆ తర్వాత ఛత్తీస్‌ ఘడ్‌ వెళ్లనున్నాడు.

అటు ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమని ఛాలెంజ్‌ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉంది..లాగ్ బుక్ లు తీసుకుని కామారెడ్డికి రా కేసీఆర్ అంటూ ఛాలెంజ్‌ చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version