రాహుల్ గాంధీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ఖరారు..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దూకుడుని పెంచుతోంది. ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన దాదాపు ఖరరావడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఇప్పటికే రాహుల్ సభకు సంబంధించిన అనుమతులతో పాటు ఏర్పాట్లను నేతలు దగ్గరుండి చూస్తున్నారు. రాహుల్ తెలంగాణ పర్యటనలో ఎం దిశానిర్దేశం చేయబోతున్నారు..? పార్టీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది…? ఇదే ఇప్పటి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠగా మారింది.కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో గెలుస్తామనే ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ.

మరోవైపు రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన దాదాపు ఖరారు అయింది. రేపు మధ్యాహ్నం 12:35 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాహుల్ గాంధీ నేరుగా తాజ్ కృష్ణ హోటల్ లో cwc మీటింగ్ లో పాల్గొననున్నారు రాహుల్. ఎల్లుండి తుక్కుగూడ సభ అనంతరం శంషాబాద్ ఎయిర్ ఫోర్టు నుండే రాత్రి 8:50 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. రెండు రోజుల పాటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, సోనియాగాంధీ, 4 రాష్ట్రాల సీఎంలు, సీడబ్లయూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్ వద్దకు చేరుకుంటున్నారు ఏఐసీసీ ముఖ్యనేతలు. మరోవైపు కాంగ్రెస్ నేతల సమక్షంలో పలువురు ఇతర పార్టీల నాయకులు కూడా ఈ సభలో చేరేఅవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు తుక్కుగూడలో నిర్వహించే విజయభేరీ సభలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో కలిసి పార్టీలో జాయిన్ అవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version