తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నట్ల వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఉత్తర – దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Rain-alert-in-telangana
రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 42°C నుండి 44 °C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు తూర్పు, దక్షిణ జిల్లాలలో, రేపు దక్షిణ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (ఈ రోజు గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ, రేపు 30 నుండి 40 కిమీ)తో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.